Friday, July 16, 2010

ఈ చినుకుల్లో తడవండి

నాకు చాల ప్రియమైన ఈ కవిత లు అందరి కోసం


“యేడికి బోతివి కరిమబ్బు వానోడా.......
..........................................................................
తూర్పు దిక్కునించి తుమ్మవనమోలె
పచ్చిమం దిక్కున పాల నవ్వుల్తోని
ఉత్తరాన్నించి ఉరుముకుంట
దచ్చినంనించి దండిగా వచ్చి
నిండిన సెరువుకుంటలతో అద్దాల రైకద్దవా
సినుకుపూల సీరెసుట్టవా

జూపాక సుభద్ర



“వానకు తడిసిన పువ్వొకటి
రాలిపడుతోంది బావిలో
సుళ్ళు సుళ్ళుగా తిరుగుతూనూ
సున్నాలు చుడుతూనూ
నవ్వుతూనే ఉందది
తుళ్ళుతూనే ఉంది
నీళ్ళమీద తేలుతూ వుంది
పాతకొమ్మని కొత్తనీళ్ళని
చూస్తూ ఉందది
మార్చి మార్చి

పాలపర్తి ఇంద్రాణి




“వర్షాన్ని ప్రేమిస్తే
అది నిన్ను చుట్టుకుని చుట్టుకుని
నీవెంటె వస్తూ నీలోకి చేరిపోతుంది
వర్షం ఒక దుఃఖమూ,ఒక సుఖమూ
వర్షం ఒక ప్రాణమూ ,పరిమళమూ
భూమి కఠంలో మెరిసే ముత్యాల సరమూ”
శివారెడ్డి

5 comments:

మాలా కుమార్ said...

మీ వానచినుకులు బాగున్నాయండి .

సత్యవతి said...

ఆ కవితలు మొత్తంగా చదివితే ఇంకా తడిసి మురిసిపోతారు.మీ అభినందనకు థాంక్స్
సత్యవతి

psm.lakshmi said...

మొదటి రెండు కవితలూ చాలా బాగున్నాయి. మూడోది నాకు వంటబట్టలేదు.
psmlakshmi

శ్రీలలిత said...

వర్షం మనసులోని మాటని మెత్తపరుస్తుంది. చల్లని మేఘంలా మనని తాకుతుంది. ఆ చల్లదనానికి స్పందించిన భావుకుల మనసుని విప్పిచెప్పినట్టు అందుకే ఆ కవితలంత బాగున్నాయి.

malli said...

ఏంటీ మా కధల సత్యవతి గారేనా!!!మాకు చెప్పకుండా చడీ చప్పుడు లేకుండా...మొత్తానికి కనిపెట్టేసాను కదా...చాలా సంతోషంగా ఉంది.బ్లాగ్ బావుంది.'' నా కధ చదివారా ''అని అడిగి చదివించుకున్నట్లుగానే ''మరి నా బ్లాగ్ కూడా చూడండి''